 
									 
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రాజక్ట్ వారు ఈ రోజు(31/10/25) గుంటూరు జిల్లా పెద కాకాని మండలం నంబూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన కార్యక్రమ లో జోనల్ సూపర్ వైజర్ బి నాగేశ్వరావు మాట్లాడుతూ పిల్లలు చిన్న వయస్సు లో చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు అని , విద్యార్థులు కు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి అది ఎలా వస్తుంది ,ఎలా రాదు , తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశాలపై మరియు మాదక ద్రవ్యాలు గురించి సమాచారం అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ వసుంద్రదేవి సి హెచ్ షేక్ షరీఫ్ ఎ యన్ యం పి నీలిమ , పాటశాల సిబ్బంది , క్లస్టర్ లింక్ వర్కర్ జి జయ లక్ష్మీ ఆశ కార్యకర్త కె కోటేశ్వరీ పాల్గొన్నారు


