Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్

భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మార్కెట్ కమిటీ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి ఇందిరా గాంధీ ఫోటోకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీమ గంగారం మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారని, ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇందిరాగాంధీ గారు దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారని అన్నారు. ఇందిరా గాంధీ భారతదేశ ఏకైక మహిళా ప్రధానమంత్రిగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, మున్నూరు కాపు అధ్యక్షులు సంతోష్, సిద్ధప్ప పటేల్ , మైనార్టీ నాయకుడు కలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగురాం, సాయి నీ బసవరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు