జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భారతదేశ తొలి మహిళ ప్రధానిగా అనేక సంస్కరణలను అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిన ధీర వనిత ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దివంగత ప్రధాని,ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు చిత్రపటానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడతూ.. గరిభి హటావో నినాదంతో పేదలకు కనీస అవసరాలైన కూడు,గూడు,గుడ్డ కల్పించి, రాజ భరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరమ్మ కే దక్కిందన్నారు. ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని, ఆమె ఆశయాలు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న ) రవీందర్ చిందం రవి యం డి రఫీ. మారెపల్లి వరదరాజు కంటయ్య రాజేందర్ సదయ్య బసాని మార్కండేయ బసాని రవి చిరంజీవి రంగు బాబు తదితరులు పాల్గొన్నారు….


