Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన పత్తిపాక గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 120 తెల్లజాతి పశువులకు 125 నల్ల జాతి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ప్రజ్వాల్ సంస్థ గ్రామ కార్యకర్త పోరండ్ల.భానుమతి మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేయించి మూగజీవాలను రక్షించు కోవాలని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రవి రమేష్ బాబు, సదానందం, ప్రజ్వాల్ డైరెక్టర్ ఎడ్ల రజిత పిన్నింటి కిషన్ రెడ్డి చిట్టీరెడ్డి జయపాలరెడ్డి రాజిరెడ్డి చిట్టీరెడ్డి సాంబరెడ్డి బొగం సాంబరాజు మందడి రాజు పున్నం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు…..