Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలోని సంస్థానలన్ని ఏకం చేసి నేడు దేశం ఐక్యంగా ఉండేలా చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధానిదేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారు. ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం ఆయన సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ నాయకులు బుజ్జన్న చిందం రవి రఫీ వరదరాజు కటయ్య రాజేందర్ సదయ్య బాసని రవి మార్కండేయ చిరంజీవి రంగు బాబు తదితరులు పాల్గొన్నారు…