Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో నేడు, ఎన్ఎస్ఎస్ యూనిట్ I& II ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని ఘనంగా నిర్వహించారు . కళాశాల ప్రిన్సిపాల్ కె అశోక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించి ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులచే జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ జి. వెంకటేశం ,వై .సంజీవరెడ్డి అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు