జనం న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం
కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఎస్సై అవినాష్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుధాల్లో ఏకే 47, 2ఇంచ్ మోటర్, 303, రైఫిల్స్, ఇన్సాస్, వాటి వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు. అలాగే వాకి టాకీ, డ్రోన్ కెమెరా లు వినియోగం, అది పనిచేసే విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాట్రేనికోన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సై అవినాష్, సిబ్బంది విద్యార్థులకు పలు విషయాలు వివరించారు. ఆయుధాలు ఏ విధంగా వాడాలో నేర్పించారు. పోలీసులు విధినిర్వహణ వివరించారు.అలాగేచెయ్యేర జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పోలీస్ విధులు, పోలీస్ ర్యాంక్స్, పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్స్ , పోలీస్ డ్యూటీస్, విధానాలను తెలియజేయడం జరిగింది




