Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31

సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నేషనల్ యూనిటీ డే ను హెచ్ఎం షేక్ మౌలాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైంది. భారత ప్రభుత్వం తొలి ఉప ప్రధానిగా,హోం శాఖ మంత్రి గా దేశ సమైక్యత , సమగ్రత కోసం ఉక్కుమనిషి గా సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే దేశభక్తిని కలిగి ఉండాలని సర్దార్ వల్లభాయి పటేల్ చిత్ర పటాల తో ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఎం షేక్ మౌలాలి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఐడి కార్డులు అందచేశారు.తమ పిల్లల ఐడి కార్డులు చూసి తల్లిదండ్రులు ఆనందాన్ని. సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అలి వేలుకుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.