జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సహకార బ్యాంకు అడ్జసెంట్ రోడ్డు వలన వర్షా కాలంలో అక్కడ నివాసముంటున్న వారు చాలా అవస్థలు పడుతున్నా రని మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకు రావడంతో ఆయన మండల పరిషత్ అభివృద్ధిని నుండి 15 ఫైనాన్స్లోసుమారు 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది సదరు పనులు, విజయ వంతంగా నిర్వహించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండల ఉన్నత అధికారులు మరియు గ్రామస్తుల సమక్షంలో టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ప్రాంతీయ ప్రజలు కోరిన వెంటనే C C రోడ్డు ను మంజూరు చేసిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి కి మరియు ప్రాంతీయ వైయస్ ఆర్సీపీ నాయకులకు ధన్యవాద ములు తెలుపు కుంటూ శాలువలు కప్పి సత్కరించారు .ఈ కార్య క్రమంలో మండల అభివృద్ధి అధికారి కె.ఆర్.ఎం ప్రసాద్, ఇఓపిఆర్డి సునీల్, వైస్ ఎంపీపీ తుమ్మల భావన శ్రీధర్ గౌడ్, వైస్ ఎంపీపీ అనుదీప్ జై సింహ, ఎంపీటీసీ పునగాని వెంకట సుబ్బమ్మ మండల కో ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, మాజీ వార్డు మెంబర్లు నాగభూషణం, ముమ్మడిశెట్టి సుధాకర్, మాజీ ఏజీపీ షమీవుల్లా ఖాన్ ,నవాబ్ జాన్, టైలర్ రఫీ,సూరజ్ ట్రైలర్స్ మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా సెక్రెటరీ పల్లె గ్రీషమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు షాజహాన్, శ్రీవాణి, లక్ష్మీదేవి, దేవి, హర్ష, హరి ప్రసాద్, హరి, పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు


