జనం న్యూస్, నవంబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ )
సిద్దిపేట బి ఎల్ టీ యూ, జిల్లా కార్యాలయం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి . ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీడీ పరిశ్రమ లో 2010,సంవత్సరంలో 33,రోజు పాటు సమ్మే చేసి సాధించుకున్న జి,ఓ, ప్రకారం బీడీ కార్మికులకు వేతనాలు, కరువు భత్యం,చేల్లిచాలని,వేయ్యి బీడీ లకు 800/-కూలీ ఇవ్వాలని, బీడీ కార్మికులకు,అందరికీ, పి,యప్,ఇ,యస్, ఐ,ఇన్సూరెన్స్, ఇవ్వాలని, బీడీ పరిశ్రమ ప్తె జి,యస్,టీ,కోఫ్టా చట్టం రద్దు చేయాలని, బీడీ కార్మికులందరికి,రాష్ట్ర ప్రభుత్వం, ఎలాంటి షరతు లేకుండా, 4016/-రూ,ల జీవన భృతి,కేంద్ర ప్రభుత్వం,6000/-ల,జీవన భృతి ఇవ్వాలని, రిట్తెర్మెంట్ పెన్షన్, కేంద్రం ప్రభుత్వం,9000/-రూ,లు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీడీ కార్మికులకు ఇంటి స్థలం, ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, వెయ్యి బీడీ లకు నాణ్యమైన అకు,ఇచ్చి,26,రోజు కు పని ఇచ్చి, ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు, జీతాలు ఇవ్వాలని ,,అందరికి, పియప్,ఇయస్,ఐ,కల్పించాలని,ఈ సమస్య ప్తె నవంబర్,3,సోమవారం రోజు తెలంగాణ రాష్ట్రములోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దర్నా లు చేయాలని పిలుపునిచ్చారు,
ఈ సమావేశంలో, బి ఎల్ పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ కుమార్, నాయకులు దబ్బేట ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


