జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం రెడ్‌క్రాస్ యోగా సెంటర్‌లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆర్. లలిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టాలు, నానోమెడిసిన్స్, ఆన్‌లైన్ డ్రగ్ సేల్స్‌పై ఆమె వివరించారు.కెరీర్ గైడెన్స్, క్వాలిటీ ఆడిట్స్‌పై విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సిబ్బంది, ఎంఆర్ ఫార్మసీ విద్యార్థులు పాల్గ్‌న్నారు.


