విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్.
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద మరియు వన భోజనాలు
నిర్వహించే పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, త్రొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నవంబరు 1న అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – కార్తీమాసంలో అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలు, ఇతర దేవాలయాలను దర్శించుకొనేందుకు మరియు వన భోజనాలు చేసేందుకు పిక్నిక్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత పోలీసు అధికారులు వారి పోలీసు స్టేషను పరిధిలోని ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, త్రొక్కిసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, త్రొక్కిసలాటలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ఆలయాలు వద్ద డ్రోన్స్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు దర్శనార్ధం క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగు స్థలాలను ఏర్పాట్లు చేయాలన్నారు.
అలాగే పిక్నిక్లలు, నదులు, సముద్రాలు, జలపాతాల వద్ద స్నానాలు చేసే సమయంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని, ప్రజలను అప్రమత్తం చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను తమ పిల్లలను నదులు, సముద్రాలు, జలాపాతాల వద్ద విడిచిపెట్టవద్దని, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు వారి సూచనలను పాటించాలన్నారు. పోలీసుల సహాయం కోసం లేదా పోలీసులకు సమాచారంను అందించేందుకు డయల్ 100/112 లకు ఫోను చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద భద్రత ఏర్పాట్లును సంబంధిత డిఎస్పీలు, సిఐలు పర్యవేక్షించాలని, ఎస్ఐలకు తగిన సూచనలు చేయాలని, భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.


