తెర వెనుక రాజకీయాలు వద్దు
పార్టీలు కతీతంగా కలిసి పోరాటం చేద్దాం
స్వార్థ ప్రయోజనాలను విడనాడండి
మండల ప్రజల మనోభావాలను దెబ్బ తీయకండి.
పత్రికా సమావేశంలో వైసిపి నేతలు డిమాండ్
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో ఉంటుందని ప్రస్తుత జిల్లాల పునర్ విభజన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల వల్ల మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాకే పరిమితం అవుతుందని మండల ప్రజల ఆందోళన చెందుతున్నారు. నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం వైసిపి నేతలు, ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో విజయనగరం జిల్లాలో ఈ మండలాన్ని ఉంచాలని అన్ని పార్టీల సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అప్పట్లో వైసిపి అధికారంలో ఉన్నప్పటికీ మండల ప్రజల ఇబ్బందులు, మనోభావాలు గుర్తించి జిల్లా మంత్రుల సహకారంతో విజయనగరం జిల్లాలో కొనసాగాలని ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వ మండల నేతలు స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మెంటాడ మండల వాసులు మన్యం జిల్లా పార్వతీపురం వెళ్లాలంటే రాను పోను 180 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలు పడవలసి ఉంటుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంటున్న మెంటాడ మండల వాసులు విజయనగరం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే నని చెప్పారు. ఇతర పార్టీ నేతలు తమ స్వార్ధపర రాజకీయాల కోసం తెర వెనక రాజకీయం చేయవద్దని నేతలు విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా పోరాడితేనే విజయనగరం జిల్లాలో మన మండలం కొనసాగుతుందని సమావేశంలో పేర్కొన్నారు. మండలంలో యువత, విశ్రాంతి ఉద్యోగులు, వైసిపి పార్టీ కార్యకర్తలు, ప్రజలు, మహిళలు ఉద్యమాలకు ప్రణాళికలు రూపొందించు కోవడం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, జిల్లా ప్రాదేశిక అధికార ప్రతినిధి లెంక రత్నాకర్ నాయుడు, వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, సర్పంచ్ లు సంఘం అధ్యక్షులు రేగిడి రాంబాబు పిట్టాడ సర్పంచ్ కాపారపు పైడిపు నాయుడు, వైసీపీ పార్టీ సీనియర్ నేత రెడ్డి రాజప్పల నాయుడు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


