Listen to this article

(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసి పేట రవి )

భీమారం మండల కేంద్రంలో గ్రామ సింహాలు కుక్కలు ఎక్కువగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయి మండలంలోని పలు గ్రామంలో కుక్కల శౌర్య విహారంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వెళ్లడానికి వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితులు మండల కేంద్రంలో నెలకొన్నాయి గ్రామంలో కుక్కల బెదడా కారణంగా పెద్దలు పిల్లలు ఒంటరిగా పనుల మీద బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు ప్రతిరోజు ఏదో గ్రామంలో కుక్క దాడితో ఎవరో ఒకరు గాయాల పాలవుతున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కుక్కలు దాడులకు దిగుతున్నాయి ఇంటి వద్ద ఉన్న పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొన్నది గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రధాన రహదారిపై వాహనాలకు అడ్డంగా రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆసుపత్రుల పాలైన ఘటనలు నెలకొన్నాయి. మరోవైపు కోతులతో రైతులు పంటలు నష్టపోవడంతో గృహంలోకి ఉన్న వాళ్లను కూడా మందలుగా వచ్చి గృహంలో వెళ్లి ఇంటి లోపల ఉన్న వస్తువులను నాశనం చేయడం జరుగుతుంది. వీటి వల్ల బయటకు వెళ్లడానికి ప్రజలు భయంతో ఇబ్బంది పడుతున్నారు . గ్రామల ప్రజలు వాపోతున్నారు ప్రజా ప్రతినిధులు లేకపోవడం పంచాయతీ కార్యదర్శులు వాటి నియంత్రణకు చర్యలు తీసుకుపోవడంతో కుక్కలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి కుటుంబాల నియంత్రణ క్షేత్ర చికిత్సలు చేపించాలని దానివల్ల వాటి యొక్క సంఖ్య పెరగకుండా నియంత్రణ కలిగించాలని గ్రామల ప్రజలు కోరారు.