

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడవరపు రంగ నాయకులు సహకారంతో చిలకలూరిపేట నియెజక వర్గ అధ్యక్షులు బి.శ్రీను నాయక్ డైరీ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ నూతన క్యాలెండర్ చాలా అద్భుతంగా రూపొందించమన్నారు.పలువురు రాజకీయ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ప్రశంసించారన్నారు.పంపిణీ చేయడం లో ఎక్కడ వెనుక అడుగు వేయాలేదన్నారు. ప్రతినిత్యం ప్రజల సమస్యల మీద వార్తలు పెడుతూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అని, అనేక కార్యక్రమాలు యూనియన్ తరపున చేస్తున్నామని, కొంతమంది మేము చేసే కార్యక్రమాలని ఓర్చుకోలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వాళ్లకు తగినట్టు బుద్ధి చెప్తామని శ్రీను నాయక్ హెచ్చరించారు . నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద పోరాడే దిశగా మా ఆలోచనలు ఉంటాయి తప్ప ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమాలు జరిగిన ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో
కమిటీ సభ్యులు తుర్లపాటి వెంకట నగేష్. పత్తిపాటి చిన్నా. సలికినీటి నాగరాజు. సుభాని. కె నాగరాజు. బి రాంబాబు తుంపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు