జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, నవంబర్ 3 :
పటాన్‌చెరు జె.పి. ఫార్మ్స్‌లో సోమవారం సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూరోకిడ్జ్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొని సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, సహజ ఎరువుల వినియోగం వంటి అంశాలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యం మహేష్ ను మాదిరి ప్రిథ్వీరాజ్ అభినందించారు. విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ అవసరంపై అవగాహన కల్పించారు.ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ — ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ చైతన్యం మరియు సుస్థిర వ్యవసాయంపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసులోనే ప్రకృతితో స్నేహం చేయడం, పర్యావరణాన్ని కాపాడే అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు


