Listen to this article

జనం న్యూస్ నవంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్‌ స్థానిక నాయకులతో కలిసి బూత్ నంబర్ 392 లో సిద్ధిపేట నుండి పర్షికులుగా వచ్చిన మునిసిపల్ చైర్మన్ రాజ నర్సు మరియు వారి బృందంతో కలిసి బస్తీలో ఇంటింటికి తిరుగుతూ కార్ గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతా గోపినాథ్ కి భారీ మెజారిటీ లో గెలిపియాలని ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది…ప్రచారం సందర్భంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి లాభాలు లభించలేదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు స్పందిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే అభివృద్ధి కొనసాగిందని, తద్వారా వచ్చే ఉపఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీకి మళ్లీ ఓటు వేయాలని తాము సంకల్పించామని తెలిపారు.