Listen to this article

జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి

విద్యా విధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల గురుతర బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత , నమస్తే ఉపాధ్యాయ పత్రిక సహాసంపాదకులు ఇట్టే కృష్ణారెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఎస్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ ,మాజీ ఎమ్మెల్యే కత్తి నరసింహ రెడ్డి , ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు భీమనాథుని రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడు, మాజీ అధ్యక్షుడు పర్వత్