Listen to this article

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామపంచాయతీ కార్యదర్శి బ్రహ్మ రెడ్డి కి శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రేపాల గ్రామ శాఖ కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గత నాలుగు రోజులుగా ఎస్సీ కాలనీలో నీళ్లు రాక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగు జానయ్య,సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ , సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గంట వెంకటేశ్వర్లు , పార్టీ సభ్యుడు పొనుగోటి నాగరాజు,డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు పొనుగోటి సాయి ,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.