Listen to this article

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నర్సింలు డిమాండ్ చేశారు, బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ విద్యార్థి జేఏసీ దీక్షను విజయవంతం చేయాలని సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు, వల్లపు నరసింహులు,మాట్లాడుతూ కేంద్ర పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరాహార దీక్షకు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వల్లపు నర్సింలు సలేంద్ర శ్రీనివాస్ యాదవ్ వెంకటాచారి దేశెట్టి యాదగిరి బలమైన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.