Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గాయం వర్షిత అద్భుత ప్రతిభ కనబరిచింది.ఉప విద్యాశాఖ అధికారి ఎం. శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల్లో పీఎం తర్లుపాడు మండలం, కలుజువ్వాలపాడు గ్రామం లోని జడ్పీ ఉన్నత పాఠశాల, 9వ తరగతి విద్యార్థిని అయిన గాయం వర్షిత క్విజ్ పోటీలో మొదటి బహుమతి సాధించింది అంతేకాకుండా మార్కాపురం నియోజకవర్గం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఎంపికైంది.విద్యార్థినిఅభినందించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు
నియోజకవర్గం స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థిని గాయం వర్షితను ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలకపాటి సత్యనారాయణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని ప్రతిభ పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఎం. శ్రీనివాస రెడ్డి, మార్కాపురం మండల విద్యా శాఖ అధికారులు, అలాగే తర్లుపాడు, కొనకలమిట్ల, పొదిలి మండలాల విద్యాశాఖ అధికారులు మరియు స్థానిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.