Listen to this article

జనం న్యూస్ – నవంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –

నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి దేవాలయంలో తులసి పూజ నిర్వహించి లక్ష్మీ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచార్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. వీటితో పాటు కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం నాడు సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.