జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మసక బారిన తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మంత్రి ఉత్తమ్ దంపతులపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుద్యోగి స్వప్నం ఉద్యోగం సంపాదించడమేనని,అన్ని అర్హతలు ఉండి కూడా హైదరాబాదు నగరంలో ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ లేదు ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాలు,గ్రామీణ ప్రాంత యువత ముంగిటికే హైదరాబాదులోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గత ఆరు నెలలుగా మెగా ఉద్యోగమేళాలు నిర్వహిస్తూ దాదాపు 24 వేల మంది యువతకు కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో డీట్,సింగరేణి కాలరీస్ లిమిటెడ్ హుజూర్నగర్ లో నిర్వహించిన మెగా జాబు మేళ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది యువత పాల్గొన్నారు.వీరిలో అర్హతలు ఉన్నవారికి అప్పటికప్పుడే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నిరుద్యోగ యువతకు మార్గదర్శకుడు అయినాడు.అటువంటి ఉత్తమ్ దంపతులను విమర్శించే హక్కు మీకు లేదని అభివృద్ధి విషయంలో కోదాడ నియోజక వర్గంలో ఏ మారుమూల గ్రామానీ వెళ్ళిన ఉత్తమ్ దంపతులు చేసిన అభివృద్ధి కనబడుతుందని అన్నారు.కృష్ణాజిల్లాలో 811 టిఎంసిల్లో మెజారిటీ వాటాసాధించడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషిని గుర్తించాలని అన్నారు.ఉత్తమ్ పద్మావతిల మానస పుత్రిక సన్న బియ్యం పథకం అని ఇది తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద గేమ్ చేంజర్ గా మారిందని ఈ విషయం మాజీ ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని అన్నారు మారుతున్న పరిస్థితుల కనుగుణంగా సివిల్ సప్లై సంస్థ బిజినెస్ మోడల్ నీ తయారు చేయవలసిన అవసరాన్ని మంత్రి అభిప్రాయపడ్డారని ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య జిల్లా అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు మండల అధికార ప్రతినిధి వేనపల్లి వీరబాబు గన్న నరసింహారావు తాడువాయి సొసైటీ డైరెక్టర్ గట్టు ఉపేందర్ రావ్ మునగాల గ్రామ శాఖ అధ్యక్షుడు ఈదర్ రావు కలకోవా గ్రామ శాఖ అధ్యక్షుడు పనస శంకర్ కాసర్ల వెంకట్ జిల్లెపల్లి శ్రీనివాస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు


