Listen to this article
  • నీటి సరఫరా మురికి కాల నిర్వహణ అస్తవ్యవస్థం,

– శీతాకాలంలోనే మంచినీటి కోసం చుక్కలు చూస్తున్న ప్రజలు ఎండాకాలం పరిస్థితి…?

  • ఏడాది గడుస్తున్నా ప్రత్యేక అధికారుల పాలన. జనం న్యూస్ 31 జనవరి భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి = వేసవికాలం ఇంకా ప్రారంభం కానేలేదు. శీతాకాలంలోనే మంచినీటి కోసం ప్రజలు నిరసనలు ఉద్యమాలు చేస్తున్న తీరును బట్టి చూస్తే వేసవికాలంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవని సాంకేతికాలు వస్తున్నాయి. 31 జనవరి 2024నా సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో అధికారులు బాధ్యతలు స్వీకరించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాలో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ధర్నాలు రాస్తారోకోలు సర్వసాధారణమైపోయాయి. భీమారం మండలంలో రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటినుండే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకున్నారు ఇప్పటికే తిష్ట వేసి ఉన్న సమస్యలపై అధికారులు పాలకులు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు