Listen to this article

-పోరు తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన

-చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

జనం న్యూస్ 31 జనవరి బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి=

పోరు తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం రోజున ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తాయని. అన్నారు. పత్రికలు ప్రజల పక్షాన ఉంటూ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకై సక్రమంగా పనిచేయాలని అన్నారు. పత్రికలు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల సమస్యలను ఎలుగెత్తి చూపాలని అన్నారు. పత్రికలు ప్రజల పక్షాన సమస్యలపై పోరాటాలని అన్నారు. నిజాలను నిర్భయంగా రాసి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఈ సందర్భంగా అన్నారు.