జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను అతలాకుతలం చేసి మొంత తుఫాన్ పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు, మండలంలో మగసాని తిప్ప బలుసు తిప్ప చిరయానం గచ్చకాయల పోర తీర ప్రాంత గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినందుకు , మెరుగైన సేవలు అందించినందుకు గాను వారి సేవ మరువలేనిదని ప్రదర్శించినందుకు కాను కాట్రేనికోన మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐ అవినాష్ కు ఉత్తమ సేవా అవార్డు లభించింది ఆ మేరకు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా చేతుల మీదుగా మొంత తుఫాను సమయంలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు, ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల్లో రెవెన్యూ యంత్రాంగం పోలీసు శాఖ వారు విద్యుత్ శాఖ వారు మరియు అన్ని శాఖల సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేశారని శ్రీ జిల్లా కలెక్టర్ కితాబునిచ్చారు



