Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.

దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన రైతు బాంధవుడు సోమేపల్లి పేట లోనే మళ్లీ పుట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాసన్ అన్నారు మాజీశాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య 25వ వర్ధంతి కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న సోమేపల్లి విగ్రహానికి గోవిందు శంకర్ శ్రీనివాసన్ బేతంచర్ల రామకోటేశ్వరరావు, చే రెడ్డి శ్రీరామ్ రెడ్డి సుంకర హరిబాబులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దివంగత మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యం రాధాకృష్ణ నాదెండ్ల మండల ఎస్సీ నాయకులు కోవూరి శ్రీధర్ పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పిన నేత సోమేపల్లి సాంబయ్య అని ఆయన అడుగుజాడల్లో నడవటం అంటే కాంగ్రెస్ పార్టీని విజయ పధాన నడిపించడమేనని అన్నారు. బేతంచర్ల రామకోటేశ్వరావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతర ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగించిన ఆదర్శ నాయకుడు
సోమే పల్లి సాంబయ్యని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాధాకృష్ణ మాట్లాడుతూ సోమేపల్లి సాంబయ్య తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా నవ శకాన్ని సృష్టించారని అన్నారు. సాగునీటి కోసం తపిస్తున్న పంట భూములకు సాగునీరు అందించి అన్నదాతల కళ్ళలో ఆనందం చూడాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రంలో మొట్టమొదటి ఎత్తిపోతల పథకాన్ని చిలకలూరిపేట మండలంలోని గోపాలం వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేయించి రైతు జన బాంధవుడుగా కీర్తి గడిచారని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలిప్పించి గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చిన మానవతా వాది సోమేపల్లి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాసన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచర్ల రామకోటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చేరెడ్డి రామ రెడ్డి కాంగ్రెస్ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ రాహుల్ సేన్ అధ్యక్షుడు షేక్ లాలు సలాం మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు షేక్ ఖాజా బుడే షేక్ షేర్ హసన్ షేక్ మహమ్మద్ షేక్ బుడ్లే షేక్ ఖాజా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగి నరసింహారావు సుంకర హరిబాబు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు పల్లె పోగు రాజు కంభం పాటి పుల్లయ్య. కత్తి రాజు పుల్లగూర పరదేశి పుల్లగూర రవి దావల మరియదాసు న్యాయవాదులు ఎప్పాల అంజిరెడ్డి పోతుల శ్రీనివాసులు ఎస్పీ నాయకులు కేతావతు సాంబశివ నాయక్ అల్లం సుబ్బారావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు