Listen to this article

జుక్కల్ నవంబర్ 4 :-(జనం న్యూస్)

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు..భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా వెళ్తున్న సద్గురు సోమాయప్ప గారిని మార్గమధ్యలో కలిసి పూజలు నిర్వహించి సోమాయప్ప గారి ఆశీర్వాదం తీసుకొని వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు..అనంతరం కపిల్ దార్ కు చేరుకొని మన్మథ్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి ,సాయి పటేల్, బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్కార్ , గుండె కల్లూరు మాజీ ఎంపీటీసీ రాజు పటేల్ , మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ , వికాస్ నాయక్ , రమేష్ , నాగేష్ పటేల్ , గజూ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు