Listen to this article

జేత్వాన్ బుద్ధ విహార్ లోగద్దర్ 77 జయంతివేడుకలు*

జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రజా యుద్ధనౌక గద్దర్ 77 జయంతి నీ వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్ మాట్లాడుతూ జీవితాంతం ప్రజలలో ఉంటూ , ప్రజల సమస్య కొరకు పోరాడిన గొప్ప విప్లవ యోధుదు గద్దర్ అని అన్నారు. సమాజంలోని అణగారిన ప్రజల తన ఆట పాటలతో చైతన్యం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఆర్గనైజర్ విజయ్ ఉప్రే, అంబేద్కర్ సంఘం నాయకులు సమాజ అధ్యక్షులు విలాస్ కోబ్రాగడే రాజేంద్ర ప్రసాద్ మహాత్మా, సమతా సైనిక్ దళ్ ఇంచార్జ్ దుర్గం సందీప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ, యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ ,నాయకులు రోషన్ ఉప్రే, దుర్గం శ్యామ్ రావు డోండుజి, లహుజి సామ్రావ్ దుర్గే, నాగ్ సేన్ , వివేక్, అరుణ్ ,ఇంద్రజిత్ , ప్రతాప్ , దుర్గం మనోజ్, సెల్వట్కర్ భీమ్రావు, దుర్గం మును,చూనర్ కార్ లడ్డు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు