జనం న్యూస్ నవంబర్ 04
కోదాడ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన భూక్య వెంకటేశ్వర్లు నవంబర్ 2న తమ్మర వాగు కాలువ వద్దకు గేదలు మేపడానికి వెళ్లి తిరిగి రాలేదు. గేదలు కాలువ వద్ద ఉన్నప్పటికీ, వెంకటేశ్వర్లు ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కాల్వలో పడి ఉంటారని కుమారుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


