Listen to this article

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్‌.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్టీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది.
దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు.
నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.