జనం న్యూస్, నవంబర్ 05,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం
రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో గల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఫణి గిరి ప్రదక్షిణను యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పంచదార్ల కొండచుట్టూ ఉన్న వివిధ గ్రామాల మీదుగా 27 కిలోమీటర్ల దూరం గిరిప్రదక్షిణ జరుగుతుందని,పంచదార్ల ఆలయం అతిపురాతనమైన శివ క్షేత్రంగా పేరుగాంచిందని, వందల ఏళ్లుగా నేటికీ నిరంతరం జాలువారే 5 మంచినీటి ధారలు ఈ ఆలయ విశిష్టత అని,ఐదు మంచినీటి ధారల వలననే ఈ ఆలయానికి పంచదార్ల ఆలయం అని పేరు వచ్చిందని, గిరిప్రదక్షిణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని,భక్తుల సౌకర్యార్ధం త్రాగునీరు, ప్రసాదాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని,గిరి ప్రదక్షిణం కారణంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని,భక్తులతో గిరి ప్రదక్షిణ మార్గమంతా శివనామస్మరణతో మార్మోగుతుందని,గిరిప్రదక్షిణ ధ్వారా మనో వాంఛలూ, అరోగ్యమూ సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు, భక్తులు,కూటమి నాయకులు మరియు ఆలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




