

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
రాజకీయం నిరుద్యోగులు తమ కాలక్షేపం కోసం, అవినీతి పత్రిక ద్వారా ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు పుల్లారావు.
జగన్ రెడ్డి తన కార్యకర్తలకు ఇచ్చిన చట్టబద్ధతలేని వాలంటీర్ ఉద్యోగాలు తప్ప.నిజమైన నిరుద్యోగులను ఆదుకున్నాడా పుల్లారావు.
కూటమిప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీతో మెగాడీఎస్సీ నిర్వహణ నిర్ణయంతో పాటు, 6 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేసింది. వైసీపీ ప్రభుత్వ అవినీతి, వేధింపులతో రాష్ట్రం వైపు చూసేందుకు సంకోచిస్తున్న పారిశ్రామికవేత్తల్ని ఓర్పు, నేర్పుతో తిరిగి ఏపీకి వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. దావోస్ పర్యటనపై విషం చిమ్మినా జగన్ అవినీతి మీడియా, తాజాగా జాబ్ కేలండర్ పై దుష్ప్రచారానికి తెరలేపింది. పనిలేని, పనిచేసే ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేని కొందరు రాజకీయ నిరుద్యోగులకు, అవినీతి మీడియాకు కూటమిప్రభుత్వం ఉద్యోగాల కల్పన దిశగా వేసే అడుగులు ఎలా కనిపిస్తాయి ఐదేళ్ల పాటు అవినీతి కేలండర్ అమలుచేసిన వారికి, చంద్రబాబు సర్కార్ జాబ్ కేలండర్ అమలు దిశగా వేసే ప్రణాళికలు ఏం అర్థమవుతాయి రూ.1000ల పింఛన్ ని ఐదేళ్లు పెంచిన జగన్ రెడ్డికి.నూటికి 1000శాతం హామీలు అమలుచేస్తున్న కూటమిప్రభుత్వంపై విషం చిమ్మడం రాజకీయ అజ్ఞానం కాదా
ఏపీ ప్రభుత్వ నూతన పాలసీలు.
రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయి ప్రత్తిపాటి
చంద్రబాబు గత అక్టోబర్లో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 4.O, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్ డెవలప్‌మెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ ఎలక్ర్టానిక్స్ పాలసీ, ఏపీ ప్రైవేట్ పార్క్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలను ప్రకటించారు. త్వరలోనే టూరిజం, ఐటీ, వర్చువల్ వర్కింగ్ పాలసీలను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ ఆరు పాలసీలు గేమ్ ఛేంజర్‌గా మారతాయన్న ముఖ్యమంత్రి మాటలు త్వరలోనే కార్యరూపం దాలుస్తాయి. వాటికి కొనసాగింపుగా వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదం దిశగా ఏపీ ప్రభుత్వం దావోస్ వేదికపై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో అర్థవంతమైన చర్చలు జరిపింది. ఇలా ఒక్కో అడుగూ వేస్తూ, నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలకు మార్చేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే, ఓర్వలేని రాజకీయ నిరుద్యోగులు.. విష పత్రికలు.. ప్రజాప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
సొంత కార్యకర్తలను వాలంటీర్లను చేయడం తప్ప.జగన్ రెడ్డి ఒక్క నిరుద్యోగికి న్యాయం చేశాడా
జగన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లను చేసి, ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టడం తప్ప, ఒక్క నిరుద్యోగికైనా న్యాయంచేశాడా తానేదో రాష్ట్ర యువత భవితను ఉద్ధరించినట్టు పగటికలలు కంటూ పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా, జగన్ అతని బృందానికి బుద్ధిరాలేదు. కూటమిప్రభుత్వం 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వడం.. జగన్ ఆయన పార్టీ దుకాణం కట్టేయడం ఒకేసారి జరుగుతాయి” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.