జనం న్యూస్ నవంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ‘
భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించకున్నా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు . ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు….


