Listen to this article

జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్ ఒక ప్రకటన తెలిపారు. ఆదివారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన ఢిల్లీలో గెలుపు మాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తమ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పిటిసి కార్పొరేట్ల ఎన్నికలలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలో నిలబెడతామని తెలిపారు. బి ఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోరాటం చేస్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. 13 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో త్రీవ వ్యతిరేకత వచ్చిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చిన 6 పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అనేకమంది రోగులు కిడ్నీ గుండె నొప్పితో బాధపడుతున్నారని. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన సూచించారు.
ప్రజలకు ఉపయోగపడే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలకు విద్య వైద్యం అవసరమని అటువంటి పథకాలు ఢిల్లీలో తమ పార్టీ విజయవంతం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అటువంటి పథకాలను వేరే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ అద్వానంగా తయారయ్యాయని వెంటనే నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ పథకాలను ఇంటింటికి వెళ్లి విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
వచ్చే నెల 10వ తేదీన హైదరాబాద్ లో తమ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశానికి జిల్లాల నుండి కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.