

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి ఎస్సై ప్రభాకర్
జనం న్యూస్ ఫిబ్రవరి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట్ మండలం లోని తిమ్మయ్య గారి
గవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్, ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లల చేత రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు.ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఈ సందేశము చేరాలని ప్రతి ఒక్కరికి ఈ నినాదం వినిపించాలని ఉద్దేశంతోటి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పాటించలని ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. కాకపోతే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిరంతరము ఇదొక రోడ్ సేఫ్టీ అనేది ఉద్యమంలో కొనసాగిస్తూనే ఉంటాము ఇది ఆగని ఉద్యమము అంతులేని అంతం లేని ఉద్యమం లాగా ఎప్పటికీ మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం .వి.ఐ శ్రీనివాస్,ఎస్సై ప్రభాకర్, తిమ్మయ్య గారి గవర్నమెంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యులు, ఉపాధ్యులు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పలువురు పాల్గొన్నారు.