ఘనంగా సిలివేరి ఇంద్ర గౌడ్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం బుదవారం 5 వ సంవత్సరం 128 వ రోజుకు చేరుకుంది, యువజన సంఘాల నాయకుడు టి ఆర్ పి నాయకుడు సిలివేరి ఇంద్ర గౌడ్ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ నేతి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఇంద్ర గౌడ్ కు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అల్పాహారంతో పాటు అరటిపండ్లు,బ్రెడ్,పులిహోర పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో గుడాల శేఖర్ గుప్త,సామాజిక కార్యకర్తి సాదిక్ పాషా,లయన్ సామ శ్రీధర్, రాము తదితరులు పాల్గొన్నారు



