Listen to this article

(జనం న్యూస్ చంటి నవంబర్ 5)

నారాయణరావుపేట్ మండల కేంద్రంలోని, బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పూలతో, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. అభిషేకాలు, రుద్ర హోమం, మహా దీపారాధన, అన్నదానం కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించబడ్డాయి. ఆలయ వాతావరణం “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగింది. స్థానిక పూజారులు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున శ్రీ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని తెలిపారు. మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, యువత, పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, పార్కింగ్, భక్తుల క్యూలైన్‌లు సజావుగా నిర్వహించారు.సాయంత్రం దీపోత్సవం, హరతులతో వేడుకలు మరింత ఆహ్లాదకరంగా మారాయి