

జనం న్యూస్ జనవరి 31 నడిగూడెం
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి,డీఎఫ్ఓ సతీష్ కుమార్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల రికార్డులను, పరిసరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.