Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం

హీరాబాద్ మండలం శాఖాపూర్ గ్రామంలో ఎల్లమ్మ వాగు చెరువు పగిలి నీరు బయటికి పారిపోతుంది దీంతో పరిసర ప్రాంతాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు చెరువు నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలు నష్టపోవచ్చని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా షేకాపురం మాజీ ఎంపీటీసీ శెట్టి నరసింహులు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి చెరువును అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే చెరువు బండలు బలహీనంగా ఉండడంతో ప్రతి సంవత్సరం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు తక్షణమే రోడ్డులు చెరువు గోడలు పునరుద్ధరణ పనులు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు