విజయనగరం జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గౌరవనీయులైన రాష్ట్ర మఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, హెచ్.ఓ.డి.లు, సెక్రటరీలతో మరియు జిల్లా కలక్టర్లు, ఎస్పీలతో డేటా ఆధారిత పరిపాలన (రియల్ టైమ్ గవర్నెన్స్) పై వీడియో కాన్ఫరెన్స్ నవంబర్ 6న నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ శాఖల వారిగా సాధించిన అభివృద్ధిపై చర్చించారు. అదే విధంగా, వివిధ శాఖలకు రియల్ టైమ్ గవర్నెన్స్ వినియోగిస్తూ, ప్రజలకు సేవలను చేరువ చేయుటకు లక్ష్యాలను నిర్దేశించారు. పాలనలో టేక్నాలజి మరియు ఆర్టిజిఎస్ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులందరూ వారి శాఖకు సంబంధించిన దస్త్రాలను సకాలంలో క్లియర్ చేయాలన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి టేక్నాలజి వినియోగించాలని పోలీసుశాఖకు చెందిన ఉన్నతాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫరెన్సుకు హాజరయ్యారు.


