

జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల(చిన్న రాస్పెల్లి)లో గ్యాస్ రెగ్యులేటరీ పైపు లీకై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనకి కారణం అధికారుల తీవ్ర నిర్లక్ష్యమే కారణం అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయిక్రిష్ణ ఆరోపించారు.
కాలం చెల్లిన రెగ్యులేటరీ పైపు వాడటం వల్లనే ఘటన జరిగిందని అన్నారు.
ఈ గురుకుల పాఠశాలలో ఏదో ఒక ఘటన పునరావృతం అవుతుందని, ఇంత జరిగినా ప్రిన్సిపల్ పై గాని సంబంధిత అధికారులపై గానీ తగు చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు.
అనేక సందర్భాల్లో ఈ పాఠశాలలో జరుగుతున్న ఘటనలపై వివిధ పత్రికలలో వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు..
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, ప్రస్తుతం జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటనకు పాఠశాల ప్రిన్సిపల్ మరియు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కొట్రంగి కార్తీక్ పాల్గొన్నారు..