జనం న్యూస్ నవంబర్ 7 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
జిల్లా పరిషత్తు పాఠశాల సోమక్క పేట నందు ఈరోజు వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 వందేమాతరంను రచించిన గౌరవనీయులు శ్రీ బంకించంద్ర ఛటర్జీ గేయంలో పొందుపరచబడిన గొప్ప విషయాలు గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని అలాంటి వాళ్ళకే సమాజంలో గౌరవం ఉంటుందని స్వేచ్ఛ స్వాతంత్రం వైపుగా నడిపించుటకు గాను భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గేయం చాలా ప్రాచుర్యం పొందిందని దీనిని బెంగాల్ రచయిత స్వాతంత్ర సమరయోధుడు బంకిం చంద్ర చటర్జీ రాసినారని ప్రతి ఒక్కరూ నైతిక విలువలతో ఉన్నప్పుడే సంఘంలో గౌరవం ఉంటుందని గౌరవనీయులు మండల విద్యాధికారి శ్రీ పి విట్టల్ తెలుపడం జరిగింది . అదేవిధంగా దేశ యువతకు మరియు విద్యార్థులకు మంచి మార్గంలో నడవాలని దేశభక్తి ఉండాలని యువతకు సందేశం ఇవ్వడం జరిగింది .అలాగే చిలిపిచేడ్
మండల ఎస్సై కే నరసింహులు సార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎంత సంపాదించామన్నది కాకుండా దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందని భావనతో ఉండి దేశ రక్షణ సిద్ధంగా ఉండాలని దేశం రక్షించబడితే అందరూ సుఖంగా ఉంటారని లేకపోతే సంపాదించినటువంటి సంపదలో నుండి ఒక గింజ తినడానికి కూడా నీకు అధికారం ఉండదని విద్యార్థులను ఉత్తేజపరిచే ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి ,గ్రామ యువకులు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు


