జనం న్యూస్ నవంబర్ 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
వందేమాతరం గీతం 150 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా జాతీయ జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం నినాదాలు పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ వందేమాతరం నినాదం లేని స్వాతంత్ర ఉద్యమం ఊహించలేమని, బ్రిటిష్ వారు 1000 ఫిరంగు లు ఎత్తి పెడితే మన భారతీయులు వందేమాతరం నినాదంతో 1000 ఫిరంగలకు మించిన భయాన్ని బ్రిటిష్ వారు గుండెల్లో పుట్టించారని నాగ జగదీష్ అన్నారు. తాతయ్య బాబు మాట్లాడుతూ వందేమాతరం అని పిల్లల నుంచి వృద్ధులు దాకా నినదించేవారని, అంత గొప్ప స్ఫూర్తిని, ఉద్యమాన్ని రగిలించిందని, ఆ శక్తివంతమైన గీతమే మన జాతీయ గీతం అయిందని తాతయ్య బాబు అన్నారు. శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ మన జాతీయ గీతాన్ని 1875 నవంబర్ 7న బకించంద్ర చటర్జీ రాశారని, ఇతను బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు అయిన రాసిన ఆనందమఠ అనే నవల నుంచి ఈ అజరామర వందేమాతరం గీతాన్ని సంగ్రహించారని, ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమర శంఖారావం గా పనిచేస్తుందని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్ల గణేష్ ఎలమంచిలి బంగార్రాజు పెంటకోట వెంకటరమణ కాండ్రేగుల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.//


