Listen to this article

జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

మాల ఉద్యోగుల సంఘం జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న పిలుపునిచ్చారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో శుక్రవారం నాడు మాలల జిల్లా సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాలల ఐక్యత, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మాల ఉద్యోగుల సంఘం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రమైన సంగారెడ్డి అంబేద్కర్ జిల్లా సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తల్లి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు మేకల విజయరావు,శ్రీనివాస్, మోహన్ రాజ్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు