జనం న్యూస్ 07నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐకెపి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగినది కానీ నేటి వరకు రాజారాం పల్లి, కిసులాటపల్లి, ఎల్లాపూర్, నామాపూర్, మేక వెంకయ్య పల్లి, నందగిరి,అయితుపల్లి,బత్కపల్లి,ఆరవెల్లి, తూకం వేయడం లేదు రైతులు నెల రోజులుగా వరి ధాన్యం కేంద్రాలలో పోసి నిరీక్షిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ పెగడపల్లి మండల శాఖ తరపున డిమాండ్ చేయుచున్నాము ఈరోజు కొనుగోలు గూర్చి మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎటువంటి షరతులు లేకుండా తరుగుదల లేకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తూకం వేయించగలరని తాసిల్దార్ కి విన్నవించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కోట మల్లేశం మంద భీమయ్య కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కాకర్ల సతీష్ బిజెపి నాయకులు తిరుమణి రమణారెడ్డి మాజీ మండలాధ్యక్షులు గంగుల కొమురెల్లి చింతకింది అనసూయ మార్కొండ రాజిరెడ్డి రంగు సాగర్ పెద్ది బీరయ్య మన్నె రమేష్ చింతకింది కిషోర్ క్యా స సందీప్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


