Listen to this article

జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

మండలం ను నియోజకవర్గం గా ఏర్పాటు చేయాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ శాయంపేట మండలం ను నియోజకవర్గంగా 1978 లో ఏర్పాటు చేయడం జరిగిందని దాదాపుగా 30 సంవత్సరాలుగా వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా కొనసాగారని తెలిపారు. మండలం నియోజక వర్గం గా ఉన్న సమయం లో సుమారుగా 120 గ్రామాలతో వివిధ మండలాల నియోజకవర్గాల గ్రామాలను కలుపుకొని ఉండేదని అన్నారు. మండలo చరిత్ర కలిగిన ప్రాంతం అని చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. మండలం నియోజకవర్గంగా ఉన్నప్పుడు అభివృద్ధికి దగ్గరవుతున్న క్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిలిమిటేషన్ లో భాగంగా మండలాన్ని నియోజకవర్గం ను తొలగించి, భూపాలపల్లి మండలంను కొత్త నియోజకవర్గంగా చేసి శాయంపేట మండలాన్ని అందులో కలిపారని వాపోయారు. అప్పటి రాజకీయ నాయకుల కుట్రలో భాగంగా ఈ సమస్య వచ్చిందని తెలిపారు. నియోజకవర్గం శాయంపేట నుండి దూరం అవ్వడం మూలంగా అభివృద్ధికి లేక దయనీయ పరిస్థితిలో ఉందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసే ఆలోచనలో ఉన్నందున తప్పకుండా మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల శాయంపేట మండలంలోని వివిధ రకాల పార్టీల నాయకులను ప్రజాసంఘాలను విద్యార్థి సంఘాలను సబ్బండ వర్గాలను ఏకం చేసుకుని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అరకిల్ల దేవయ్య, బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారపల్లి విజయ్ కుమార్, మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్ (డాన్) వివిధ సంఘాల నాయకులు బిక్షపతి మల్లేశం తదితరులు పాల్గొన్నారు…..