జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన కడప జిల్లా క్రీడాకారిణి శ్రీ చరణిను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా,యువజన మరియు క్రీడశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడల అభివృద్ధికి చూపుతున్న చొరవను ప్రశంసిస్తూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.మేడ విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణుల ప్రతిభను గుర్తించి గౌరవించడం ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వానికి నిదర్శనంఅని.యువత,మహిళా శక్తి,క్రీడల ప్రోత్సాహంలో మంత్రి లోకేష్ ఎల్లప్పుడూ ముందుంటారు అని తెలిపారు.రాష్ట్రరవాణా,యువజన మరియు క్రీడశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా రంగం కొత్త ఉత్సాహం సంతరించుకుంది అని.ఈ మహిళా క్రీడా కారిణుల ప్రోత్సాహార్థం శ్రీచరణి కి ₹2.5 కోట్లు నగదు, గ్రూప్–I ఉద్యోగం ,కడపలో గృహ స్థలం నజరానా నిర్ణయం కడపకు గర్వకారణం మాత్రమే కాకుండా,రాష్ట్ర యువతకు ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.అలాగే శ్రీ చరణి వంటి క్రీడాకారిణులు రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెస్తున్నారు అని. ఇలాంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి బాటలు వేస్తోంది అని ఆయన అభిప్రాయ పడ్డారు.ఈ సందర్భంగా ప్రాంతీయ క్రీడాభిమా నులు,తెలుగుదేశం కార్య కర్తలు సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ అభినందనలు తెలిపారు.


