జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఫోన్ లో జర్నలిస్ట్ లను బెదిరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏ.పీ.యు.డబ్ల్యూ.జే) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆ మేరకు శుక్రవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కే జయరాజ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏచూరి శివ ఒక ప్రకటన చేశారు… ఒక అధికారి చేసిన పిర్యాదు పై ఎలాంటి విచారణ చేయకుండా ఇద్దరు విశాలాంధ్ర విలేకర్లు గోవిందస్వామి, సురేష్ ల పై చర్యకు ఉపక్రమించటం ఏమాత్రం సమంజసం కాదన్నారు.. ఆ సందర్భంగా జర్నలిస్ట్ సురేశ్ కు కలెక్టర్ ఫోన్ చేసి నీ అంతు చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదు…ఒక ఒకపక్క బెదిరిస్తూనే మరో పక్క ఇద్దరు జర్నలిస్ట్ ల పై కేసు నమోదు చేశారని , జరిగిన పక్రియను పరిశీలిస్తే కుట్ర ప్రకారం జరిగినట్లు గా అనుమానించాల్సి వస్తుందని అన్నారు… చిత్తూరు జిల్లా ఏ.పీ.యు.డబ్ల్యూ.జే నాయకుల ద్వారా కలెక్టర్ దృష్టి కి విషయం తీసుకుపోయి తప్పును సవరించుకోవాలని కోరటం జరిగింది. ఫోన్ లో బెదిరించిన కలెక్టర్ పై కేసు నమోదు చేసి విలేకర్ల పై ఒక అధికారి ఇచ్చిన పిర్యాదు పై విచారణ చేసి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నాము.. శనివారం తిరుపతి లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాము.


