Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08

కనీస భద్రత ప్రమాణాలు పాటించని దుకాణములు సంస్థలు పర్మిషన్ల కాగితాలకే పరిమితం అవుతున్న నిబంధనలు నిత్యం వేల మంది సందర్శించే వ్యాపార సంస్థల వద్ద ఏ దైనా జరిగితే ఎవరు బాధ్యులు

పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జహీరాబాద్ పట్టణంలో రోజురోజుకు చిన్నచిన్న వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున విస్తరించడంతో జహీరాబాద్లో దాదాపు ఒక 500 వ్యాపార సంస్థలు ఉన్నాయి ఆ వ్యాపార సంస్థలలో ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం పాటించాల్సిన ఎలాంటి నిబంధనలను కూడా పాటించకుండా వ్యాపార సంస్థలు నడిపిస్తున్నారు ముఖ్యంగా పెట్రోల్ పంపులు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ తినుబండారాలను తయారు చేసే మిఠాయి షాపులు హోటల్లు లాడ్జిలు మొదలగు సంస్థల వద్ద ఏవైనా ప్రమాదాలు జరిగితే నివారించడానికి ఎలాంటి భద్రతపరమైన వస్తువులు లేకుండానే సంస్థలు నిర్వహిస్తున్నారు వీటన్నింటినీ చూస్తూ మామూళ్ల మత్తులో నిశ్శబ్దంగా ఉంటున్న అగ్నిమాపక శాఖ కొన్ని పెట్రోల్ పంపులు వద్ద పెట్రోల్ పంపు నిర్వహించడానికి కావలసిన నిబంధనలు ఏవి పాటించకుండా ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది వారికి అనుమతులు ఇచ్చి వారి వద్ద ఎలాంటి నిబంధనలు లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం వారి యొక్క లైసెన్సులు రెన్యువల్ చేస్తున్నారు ముఖ్యంగా పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేస్తే దానికి నాలుగు దిక్కుల ఫైర్ ఇంజన్ కూడా తిరగాల్సిన నిబంధనలు ఉన్నాయి అయినప్పటికీ నీ ఏ ఒక్క ఫీట్ స్థలం లేకపోయినా అనుమతులు ఇస్తానన్నారు వీరి అనుమతులతో మున్సిపల్ వాళ్లు కూడా భవనం నిర్మించడానికి అనుమతిస్తున్నారు భవనం నిర్మించడానికి అదేవిధంగా తినుబండారాలను విక్రయించే మిఠాయి షాపులు చిన్న చిన్న షాపులను అద్దెకు తీసుకొని అందులో పెద్ద ఎత్తున గ్యాస్ పోయిల మీద తినుబండారాలను తయారు చేస్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళిన ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం సంభవించే పరిస్థితి ఉన్నప్పటికీని కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం సూచనీయం అదేవిధంగా అనేక ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల వద్ద కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడతావున్నారు కనీస భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదు ఎవరైనా అధికారులు తనిఖీకి వెళితే చాలా దర్జాగా అవినీతి అధికారులు ఇచ్చిన ధ్రువ పత్రం చూపిస్తా ఉన్నారు పెయింట్ షాపులు హార్డ్వేర్ షాపులు పెద్ద పెద్ద గోదాములలో ఎలాంటి భద్రత ప్రమాణాలు లేవు ఏవైనా ప్రమాదాలు జరిగిన నివారించడానికి కనీస వస్తువులు కూడా లేవు ఈ మధ్యకాలంలో జహీరాబాద్ పోలీసులు కొన్ని సంస్థలపై దాడి చేసి కేసులు రిజిస్టర్ చేసిన కూడా ఏమాత్రం భయం భక్తి లేకుండా మిగతా సంస్థల వారు నిర్భయంగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు ఇకనైనా అధికారులు కార్యాలయంలో నుండి బయటకి కదిలి ప్రతి వ్యవస్థ పై క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్,, మాదినం శివప్రసాద్,, ప్యార్ల దశరథ్ అరవింద్,, సన్నీ ,,బాలు చినుకు కోరడం జరుగుతుంది